ఢాకా ఎయిర్పోర్ట్ లో అగ్నిప్రమాదం.. కార్గో టెర్మినల్‌‌‌‌లో పెద్ద ఎత్తున మంటలు

ఢాకా ఎయిర్పోర్ట్ లో అగ్నిప్రమాదం.. కార్గో టెర్మినల్‌‌‌‌లో పెద్ద ఎత్తున మంటలు

ఢాకా: బంగ్లాదేశ్​ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్గో టెర్మినల్‌‌‌‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎయిర్​పోర్ట్ ​అధికారులు అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం మధ్యాహ్నం 2:30కు గేట్ 8 సమీపంలో మంటలు చెలరేగాయని ఫైర్ సర్వీస్ ప్రతినిధి తల్హా బిన్ జాషిమ్ తెలిపారు. 36 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేసినట్టు ఆయన తెలిపారు.

ఈ ప్రమాదాన్ని ఎయిర్​పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ మసూదుల్ హసన్ మసూద్ ధ్రువీకరించారు. ఇందుకోసం అత్యవసర చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అయితే, విమానాలన్నీ సురక్షితంగా ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే, బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్, బంగ్లాదేశ్ నౌకాదళం, బంగ్లాదేశ్ వైమానిక దళం సహా వివిధ సంస్థలు మంటలను అదుపు చేసే ప్రయత్నాల్లో సహాయం అందిస్తున్నాయని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్​పీఆర్) తెలిపింది.