బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన మద్యం బాటిళ్లు

బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన మద్యం బాటిళ్లు

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11 లోని ఓ భవనం సెల్లార్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దారు వాలా వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజ్ లో జరిగి ఈ ప్రమాదం స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. మద్యం స్టోర్ చేసిన సెల్లార్ లో మంటలు చెలరేగటంతో భారీ ఎత్తున మద్యం అగ్నికి ఆహుతయ్యింది. 

2026 ఆగస్టు 08వ తేదీన ఉదయం జరిగి ఈ ఘటనతో  స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న హైడ్రా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్‌ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

సెల్లార్ లో చిక్కుకున్న 11 మందిని అధికారులు కాపాడారు.  అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.