దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ టాప్.. లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు

దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ టాప్.. లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు

విజయవాడ: దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ టాప్లో నిలిచింది. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై 3 రూపాయల ధర పెరిగాక.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయల 53 పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ డీజిల్ ధర 101 రూపాయల 17 పైసలకు చేరింది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయల 63 పైసలు, లీటర్ డీజిల్ ధర 96 రూపాయల 36 పైసలకు చేరింది.

దేశంలో నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం. ఇప్పటికే CNGపై 2 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్పై పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో ప‌న్ను ఆధారంగా ధ‌ర‌ల్లో మార్పులు ఉంటాయి.

కొన్ని రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించడంతో అక్కడి ప్రజలకు కొంతమేర భారం తగ్గింది. కానీ ఏపీలో తగ్గించకపోవడంతో ఇక్కడ రేట్లు ఢిల్లీ, మహారాష్ట్ర కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోంది. ఏపీలోని మొత్తం 4 వేల 510 బంక్‌‌ల ద్వారా సాధారణ రోజుల్లో రోజుకు 6 వేల 330 కిలోలీటర్ల పెట్రోల్, 9 వేల 48 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. 

రాష్ట్ర విభజన నాటి నుంచి దేశంలో ఇంధన ధరల్లో ఏపీనే టాప్లో ఉంది. ఎన్డీయే మిత్ర పక్షం అధికారంలో ఉన్న రాష్ట్రమైన ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ఉపశమనం కల్పించకపోవడంపై ఏపీ పబ్లిక్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.