లోన్ యాప్ వేధింపులకు.. హైదరాబాద్ కుర్రోడు ఆత్మహత్య

లోన్ యాప్ వేధింపులకు.. హైదరాబాద్ కుర్రోడు ఆత్మహత్య

లోన్ యాప్ వేధింపులకు మరో గుండె ఆగింది. లోన్ యాప్స్ వేధింపులు తాళలేక హైదరాబాద్ లో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... కుత్బుల్లాపూర్ ,సంజయ్ గాంధి నగర్ కు చెందిన 22ఏళ్ళ భాను ప్రకాష్ అనే యువకుడు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి ఫాక్స్ సాగర్ చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆరోరా కళాశాల లో మాస్టర్స్ చదువుతున్న భాను ప్రకాష్.. లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చినప్పటికీ లోన్ యాప్ ఏజెంట్స్ వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుండి వెళ్లిపోయిన భానుప్రకాష్ తిరిగి రాకపోవటంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు కుటుంబసభ్యులు.

Also Read:-ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అవసరం లేదు

అయితే, మొబైల్ లొకేషన్ ద్వారా భానుప్రకాష్ ఆచూకీ కనుక్కున్న స్నేహితులు చెరువు వద్ద కు వెళ్లి చూడగా అతని దుస్తులు,వాహనం గట్టు పై ఉండటంతో పోలీసులకు  పిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పెట్ బషీరాబాద్ పోలీసులు శుక్రవారం ( సెప్టెంబర్ 6, 2024 ) ఉదయం మృతదేహం వెలికితీశారు.మృతుడి మొబైల్ లో లోన్ యాప్ కు సంబంధించిన చాటింగ్ గుర్తించినట్లు తెలిపారు పోలీసులు.