ఒకప్పుడు ద్వీపంలో పర్యాటకుల సందడి.. ఇప్పుడు కాలి బూడిదైన శిథిలాలే..

ఒకప్పుడు ద్వీపంలో పర్యాటకుల సందడి.. ఇప్పుడు కాలి బూడిదైన శిథిలాలే..

యుఎస్ లోని హవాయి (Hawaii) ద్వీపం.. చెలరేగిన కార్చిచ్చుకు కాలి బూడిదై పోయింది. హవాయి ద్వీపమైన మౌయ్‌లో (Hawaii) జరిగిన అడవి మంటల విధ్వంసంలో పలు ప్రాంతాలు కాలి బూడిదగా మారాయి. ఒకప్పుడు పర్యాటకులతో సందడిగా ఉన్న మౌయ్ ద్వీపం.. ఇప్పుడు ఎక్కడ చూసినా కాలి బూడిదైన శిథిలాలే.. అనేక భవనాలు, చెట్లు, కార్లు ఇలా సర్వం అగ్గికి ఆహుతి అయ్యాయి. శతాబ్దాల నాటి పట్టణంలోని ప్రతి అంగుళం బూడిద శిథిలాలతో నరక దృశ్యాన్ని తలపిస్తున్నాయి. ఇవీ మౌయ్ ద్వీపంలో సర్వే చేస్తున్న అధికారులకు కంటికి కనిపించిన దృశ్యాలు.. మౌయ్  ప్రస్తుత పరిస్థితి. 


నేలకూలిన టెలిఫోన్ స్థంభాలు, దగ్ధమైన కార్డు. కాలిపోయిన ఎలివేటర్ షాప్ట్లు, బూడిదైన అపార్ట్ మెంట్ భవనాలకు మౌయ్  సాక్ష్యంగా నిలబడి ఉంది. బొగ్గురంగుతో కొలన్లు, ట్రాంపోలిన్, అగ్గికి ఆహుతి అయిన పిల్లల స్కూటర్లు. లాహైనాలో నష్టాన్ని  సర్వే చేస్తున్నప్పడు కనిపించిన దృశ్యాలు.. ఇది యుద్ధ ప్రాంతంలా కనిపించిందని సర్వే అధికారులు. 

యూఎస్ లోని హవాయి ద్వీపం అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపించిన విషయం తెలిసిందే.. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. మంటలు, పొగ ధాటికి తట్టుకోలేక పలువురు సముద్రంలోకి (Ocean) దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఇంకా ఈ కార్చిచ్చు అదుపులోకి రాలేదు.