తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీలు, హోర్డింగులు !

తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీలు, హోర్డింగులు !

అమరావతి: తాడేపల్లిలో జగన్ 2.0 మావిగన్ ఫ్లెక్సీలు, హోర్డింగులు కలకలం రేపాయి. తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీలు కనిపించడం గమనార్హం. ఈ ఫ్లెక్సీలను స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ‘‘రాజధాని అమరావతి వద్దు.. మూడు జిల్లాల మావిగన్తోనే అభివృద్ధి సాధ్యం’’ అంటూ ఆ ఫ్లెక్సీల్లో కనిపించడంతో వైసీపీ శ్రేణులే రాత్రికి రాత్రి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

వైసీపీకి చెందిన ఏలూరి శివాజీ పేరుతో కొన్ని ఫ్లెక్సీలు కనిపించాయి. ‘‘యువతకు ఆదర్శం.. సమాజానికి అండ మావిగన్’’ అని ఆ ఫ్లెక్సీలపై ఉండటంతో అధికార కూటమి నేతలు ఈ ఫ్లెక్సీలపై కారాలుమిరియాలు నూరుతున్నారు. తాడేపల్లిలో వన్ పార్టీ, వన్ ఫ్లాగ్, వన్ అజెండా, మావిగన్-2029 పేరుతో ఫ్లెక్సీలు కనిపించాయి.

ALSO READ : అమరావతి జోలికి వస్తే తాట తీస్తా.. 

వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పేరుతో కూడా ఫ్లెక్సీలు కనిపించాయి. ఈ ఫ్లెక్సీలు తాడేపల్లిలో హాట్ టాపిక్గా మారాయి. జగన్ ప్రతిపాదించిన మావిగన్పై కూటమి నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని.. ప్రజల్లో మాత్రం ఈ ప్రతిపాదనపై సానుకూల దృక్పథం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మావిగన్ను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని వైసీపీ అధినేత జగన్ కూడా పార్టీ నేతలకు, కేడర్కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.