అమరావతి జోలికి వస్తే తాట తీస్తా.. వెయ్యి మంది సైకోలు వచ్చినా ఆగదు : సీఎం చంద్రబాబు

అమరావతి జోలికి వస్తే తాట తీస్తా.. వెయ్యి మంది సైకోలు వచ్చినా ఆగదు : సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతిని అడ్డుకోవటానికి జగన్ లాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా అడ్డుకుంటా.. అమరావతి జోలికి వస్తే తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పుడు మూడు ముక్కలాట ఆడి.. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారని.. అమరావతి అనే పేరు పలకటానికి ఇష్టపడటం లేదంటూ మాజీ సీఎం జగన్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. 2026, ఏప్రిల్ 9వ తేదీన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా సూరేపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.

గతంలో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తే.. హైకోర్టు, సుప్రీం కోర్టులు అడ్డుకున్నాయని.. అధికారంలో ఉండి విధ్వంసం చేశాడు.. ప్రతిపక్షంలో ఉండి బెదిరిస్తున్నాడంటూ జగన్ పై విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. అమరావతి రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్ లో 49 పార్టీలు మద్దతు ఇస్తే.. ఈ ఒక్క సైకో పార్టీనే వ్యతిరేకించిందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిని అజరామరంగా.. అజేయంగా నిలుపుతానంటూ సభలో స్పష్టం చేశారాయన. 

ALSO READ : త్వరలోనే పాదయాత్ర ప్రారంభిస్తా...

రాజధాని అమరావతి అనేది సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్ట్ అని.. 2 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. విజయవాడ, గుంటూరు, మచిలిపట్నం CRDA రీజియన్ పరిధిలోకి వస్తాయని.. ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడని.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయటానికి నాకు నిమిషం పట్టదని.. అయినా చట్టం తన పని తాను చేసుకుంటుందంటూ వివరించారు సీఎం చంద్రబాబు. మారీచుడి కంటే ఎక్కువ వేషాలు ఈ సైకో పార్టీ వేస్తుందని.. రాష్ట్రం కోసం ఇలాంటి వాళ్లను ఏం చేయాలో నాకు తెలుసు అన్నారు సీఎం చంద్రబాబు.