మావోయిస్టుల డంప్ స్వాధీనం..సుక్మా అడవుల్లో భద్రతా బలగాలు తనిఖీ

మావోయిస్టుల డంప్  స్వాధీనం..సుక్మా అడవుల్లో భద్రతా బలగాలు  తనిఖీ

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా అడవుల్లో మంగళవారం భద్రతాబలగాలు మావోయిస్టుల డంప్​ను స్వాధీనం చేసుకున్నాయి. బెజ్జి పోలీస్ స్టేషన్​ పరిధిలోని బోద్​రాజ్​పదర్​ అడవుల్లో సీఆర్పీఎఫ్​ 50వ బెటాలియన్​ బలగాలు, బెజ్జి పోలీసులు కలిసి తనిఖీలు​చేపట్టారు. సరెండర్​ అయిన నక్సల్స్ ఇచ్చిన సమాచారం మేరకు భూమిలో దాచిపెట్టిన డంప్​ను వెలికితీశారు. 

ఒక 315 బోర్​ బోల్ట్  యాక్షన్​ రైఫిల్, వివిధ తుపాకుల్లో వాడే తూటాలు, అల్యూమినియం పాత్రలు దొరికాయి. పేలుడు పదార్థాలతో పాటు విప్లవసాహిత్యం స్వాధీనం చేసుకొని బెజ్జి పోలీస్​స్టేషన్​కు తరలించారు.