తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. 3 రోజులు జాగ్రత్త

తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. 3 రోజులు జాగ్రత్త

మొన్నటివరకు వర్షాలతో సతమతమైన ప్రజలు..ఇప్పుడు ఎండలతో ఉక్కిరిబిక్కరవబోతున్నారు. తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఎండలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది.  మే 15, 16, 17వ తేదీల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు హెచ్చరించింది. 

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు 42°C నుండి 44°C  వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలో 40°C నుండి 42°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వడగాల్పులు భారీగా వీయనున్నట్లు అధికారులు చెప్పారు. 

ఇప్పటికే ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఆయా ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, మండల అధికారులకు ఉన్నతాధికారులు సూచనలు జారీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.