రైలు ప్రయాణం ఇప్పుడు మరింత రుచిగా!.. రైల్వే స్టేషన్లలో మెక్‌డొనాల్డ్స్,KFC,పిజ్జా హట్ స్టాల్స్

రైలు ప్రయాణం ఇప్పుడు మరింత రుచిగా!.. రైల్వే స్టేషన్లలో మెక్‌డొనాల్డ్స్,KFC,పిజ్జా హట్ స్టాల్స్

రైల్వే ప్రయాణికులకు గుడ్​న్యూస్.. రైలు ప్రయాణం చేస్తున్నారా..? రోటీన్​ ఫుడ్​ తో బోరు కొడుతోందా? మీకు ఇష్టమైన ఆహారం లభించడం లేదా.. పెద్ద బ్రాండ్​ ఉన్న కంపెనీలు ఫుడ్స్​ దొరకడం లేదా.. డోంట్​ వర్రీ ఇకపై రైల్వే  స్టేషన్లలో రకరకాల దేశ విదేశాలకు చెందిన బ్రాండెడ్​ ఫుడ్​  కంపెనీల వెరైటీస్​ లభించనున్నాయి. మన ఇండియన్​ రైల్వే స్టేషన్లలో..ఎప్పుటినుంచి ఏయే బ్రాండెడ్​ కంపెనీల ఫుడ్స్​ లభిస్తాయో ఓ సారి లుక్కేద్దాం పదండి.. 

భారతీయ రైల్వే సంస్థ ఫుడ్​ రెవెల్యూషన్​ తీసుకురాబోతోంది.. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్లేషన్లలో రకరకాల ఆహార పదార్థాలను అందించనుంది. ఇందులో భాగంగా ప్రీమియం బ్రాండ్​ క్యాటరింగ్​ అవుట్​ లెట్స్​ ను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేస్తుంది. మన దేశ బెస్ట్​ బ్రాండ్ ఫుడ్స్ మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి ఫుడ్​ బ్రాండ్ల ఫుడ్​ స్టాల్స్​ ను ప్రతి రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనుంది. 

మెక్​ డోనాల్డ్​, KFC, పిజ్జా హట్​ , హల్దీరామ్స్​,బికనేర్​ వాలా, బాస్కిన్స్​ రాబిన్స్​ వంటి ప్రముఖ ప్రపంచ, భారతీయ ఫుడ్​ బ్రాండ్ల స్టాల్స్​ ను ఏర్పాటు చేస్తోంది. 
ఈ స్టాల్స్​ ఏర్పాటు అయితే రైల్లే ప్రయాణికులు తమ ఇష్టమైన బర్గర్లు, పిజ్జాలు, స్నాక్స్​ను ప్లాట్​ ఫాం పైనే కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే ఈ సౌకర్యాన్ని విమానాల్లో అందిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన, ఫ్రెష్​ ఫుడ్​ అందించే లక్ష్యంలో ఈ స్టాల్స్​ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ స్టాల్స్​ ను కంపెనీలు గానీ, ఫ్రాంచైజ్​ పార్టినర్స్​ ద్వారాగానీ ఈ వేలం ద్వారా  పొందవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.