- సేఫ్ మదర్డేలో మెదక్ కలెక్టర్ప్రతిమాసింగ్
మెదక్ టౌన్, వెలుగు: గర్భిణులు, బాలింతలు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మెదక్ కలెక్టర్ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సేఫ్ మదర్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ హెల్తీగా ఉంటారని, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందన్నారు.
డీఎంహెచ్‌వో శ్రీరామ్, డీసీహెచ్‌ఎస్ శివదయాల్, అడిషనల్కలెక్టర్ నగేశ్, డీఎంఏ సునీత, డీడబ్ల్యూవో హేమభార్గవి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో ఇండ్ల గణనను పక్కాగా చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జనగణన అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణలో భాగంగా ఇళ్ల గణన బ్లాకులు తయారు చేయాలన్నారు.
