ఖరీఫ్ వడ్ల కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి: మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్

ఖరీఫ్ వడ్ల కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి: మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్
  • వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపు అన్ని ఏర్పాటు పూర్తి చేయాలి 
  • ముందస్తు ప్రణాళికతో అధికారులు ముందుకెళ్లాలి 
  • ధాన్యం తరలించే వెహికల్స్ కు జీపీఎస్​ మస్ట్ గా ఉండాలి​

మెదక్​ టౌన్​, వెలుగు: జిల్లాలో ఖరీఫ్​ధాన్యం కొనుగోలుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని మెదక్ కలెక్టర్​రాహుల్​రాజ్​ సూచించారు.  ఖరీఫ్​వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. అక్టోబర్ తొలివారం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు  అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. 

గ్రేడ్- ఏ రకం ధాన్యం క్వింటాలుకు రూ. 2,389, సాధారణ రకం క్వింటాలుకు రూ.2,369  కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 4  లక్షల 23  వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందని పేర్కొన్నారు.  మిల్లులు సిద్ధంగా ఉండేలా సర్టిఫికెట్ తీసుకోవాలని, మిల్లుల ట్యాగింగ్, తనిఖీలపై దృష్టి పెట్టాలని సూచించారు. ధాన్యం తరలించే వెహికల్స్ కు జీపీఎస్​ మస్ట్ గా ఉండాలని స్పష్టంచేశారు. 

లారీలు, గోదాముల కొరత లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. గత సీజన్​లో జిల్లాలో రైస్​మిల్లులకు 5,67,841 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా.. 3,82,502 మెట్రిక్ టన్నుల సీఎంఆర్​ మాత్రమే వచ్చిందన్నారు.  ఇంకా 1,58,497 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉందని, దీన్ని త్వరగా రికవరీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్​ఆదేశించారు. 

ఈ సమావేశంలో జిల్లా అడిషనల్​కలెక్టర్​నగేశ్​, డీఏవో దేవ్ కుమార్, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్,  రవాణా శాఖ అధికారి వెంకన్న, కో--ఆపరేటివ్ అధికారి కరుణాకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్​సప్లై డీఎం జగదీశ్, అడిషనల్ డీఆర్​డీవో సరస్వతీ, మెదక్​డీఎస్పీ ప్రసన్న కుమార్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.