
విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో హిందువులకు ఒక నీతి.. ముస్లింలకు ఒక నీతి అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడబోనని చెప్పారు రఘునందన్.
మెదక్ అల్లర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిని జైలులో పరామర్శించారు ఎంపీ. మహిళా ఏఎస్ఐని బూతులు తిట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పింకీల మాటలు విని ఫోన్ ట్యాపింగ్ లో పట్టుబడ్డ కొందరు పోలీసులు ఇప్పుడు జైల్లో ఉన్నారని, అదే గతి మెదక్ అల్లర్ల ఘటన పోలీసులు కూడా పడుతుందన్నారు ఎంపీ.