V6 News

మెడికల్ ఎగ్జామ్స్ తేదీలు ఖరారు.. ఆగస్టు 30న నీట్ పీజీ-2026 పరీక్ష

మెడికల్ ఎగ్జామ్స్ తేదీలు ఖరారు.. ఆగస్టు 30న నీట్ పీజీ-2026 పరీక్ష
  • డిసెంబర్ 11, 12 తేదీల్లో నీట్ఎస్ఎస్ ఎగ్జామ్
  • 2027 జనవరి 9న ఎఫ్ఎంజీఈ డిసెంబర్ సెషన్
  • లేటెస్ట్ క్యాలెండర్ విడుదల చేసిన ఎన్ బీఈఎంఎస్ 

హైదరాబాద్, వెలుగు: మెడికల్ ఎగ్జామ్స్ కు సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్‌‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్ బీఈఎంఎస్) విడుదల చేసింది. 2026~27 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ, నీట్ ఎస్ఎస్(సూపర్ స్పెషాలిటీ), ఎఫ్ఎంజీఈ(ఫారెన్ మెడికల్ గ్యాడ్యుయేట్ ఎగ్జామినేషన్)తో పాటు డిప్లొమా, డీఎన్ బీ(డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డు) పరీక్షల తాత్కాలిక తేదీలను ప్రకటిస్తూ నోటీసులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌‌ లో కొన్ని మార్పులు చేస్తూ అప్‌‌డేటెడ్ క్యాలెండర్‌‌ ను అందుబాటులోకి తెచ్చింది.

కీలక పరీక్షల తేదీలు ఇవే..

నోటిఫికేషన్ ప్రకారం.. అత్యంత కీలకమైన నీట్ పీజీ పరీక్షను ఆగస్టు 30న నిర్వహించనున్నారు. ఇక సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎస్ఎస్ పరీక్షను డిసెంబర్ 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న వారు దేశంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు అవసరమైన ఎఫ్ఎంజీఈ డిసెంబర్ –2026 పరీక్షను జనవరి 9, 2027న నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

ఇక, పీజీ పూర్తి చేసిన డాక్టర్లకు నిర్వహించే డీఎన్బీ, డాక్టర్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పరీక్షల తేదీలను కూడా బోర్డు ప్రకటించింది.  డాక్టర్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఫైనల్ (అక్టోబర్ 2026 సెషన్) సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో జరుగుతాయి. డీఎన్బీ ఫైనల్ (జూన్ 2026 సెషన్) జూన్ 18 నుంచి 21 వరకు నిర్వహిస్తారు. ఎన్ బీఈఎంఎస్ డిప్లొమా (జూన్ 2026 సెషన్) మే 14, 15, 16 తేదీల్లో థియరీ పరీక్షలు ఉంటాయి. ఎన్ బీఈఎంఎస్ డిప్లొమా (అక్టోబర్ 2026 సెషన్) సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

.అయితే, ప్రస్తుతం ప్రకటించిన తేదీలు కేవలం తాత్కాలికమేనని, పరిస్థితులను బట్టి వీటిలోమార్పులు ఉండవచ్చని బోర్డు పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం, అప్లికేషన్ ప్రాసెస్, కచ్చితమైన తేదీల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు బోర్డు అధికారిక వెబ్‌‌సైట్ natboard.edu.in ను సందర్శించాలని సూచించింది. ఏదైనా సమాచారం కోసం వెబ్‌‌సైట్‌‌ లోని కమ్యూనికేషన్ పోర్టల్ ద్వారా సంప్రదించాలని స్పష్టం చేసింది.