
డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, హైదరాబాద్(డీఎంహెచ్ఓ, హైదరాబాద్) మెడికల్ ఆఫసీర్, సైక్రాటిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 16.
- పోస్టుల సంఖ్య: 18
- పోస్టులు: మెడికల్ ఆఫీసర్(బస్తీ దవాఖానా) 15, మెడికల్ ఆఫీసర్(పాలియేటివ్ కేర్ సెంటర్) 02, సైక్రాటిస్ట్ 01.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్ డిగ్రీతోపాటు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో నమోదై ఉండాలి. సైక్రాటిస్ట్ ఎండీ లేదా సైక్రాటిస్టులో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి46 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- జీతం: మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ. 52,000, సైక్రాటిస్టుకు రూ. 1,30,000 చెల్లిస్తారు.
- అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా డీఎం అండ్ హెచ్ఓ హైదరాబాద్, నాలుగో అంతస్తు, జీహెచ్ఎంసీ బిల్డింగ్, ప్యాట్నీ, సికింద్రాబాద్.
- అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 12
- లాస్ట్ డేట్: జూన్ 16.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ, పని అనుభవం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.