పద్మారావునగర్, వెలుగు: మెడికవర్ హాస్పిటల్స్ మరో కీలక అడుగు వేసింది. సికింద్రాబాద్‌లోని అనెక్స్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికవర్ వెల్నెస్ యూనిట్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు మాట్లాడుతూ.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వెల్నెస్ యూనిట్లో సమగ్ర హెల్త్ చెకప్‌లు, జీవనశైలి వ్యాధుల స్క్రీనింగ్, ముందస్తు నిర్ధారణ పరీక్షలతో పాటు వ్యక్తిగత ఆరోగ్య సలహాలు, వెల్నెస్ కన్సల్టేషన్లు ఒకే చోట లభిస్తాయని తెలిపారు.
ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ యూనిట్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సరికొత్త వైద్య సాంకేతికతతో కూడిన ఈ కేంద్రం ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించవచ్చని, ఇది రోగులకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాస్పిటల్ సెంటర్ హెడ్ కృష్ణవేణి, జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
