స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి..మేడిపల్లి సత్యం డిమాండ్

స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి..మేడిపల్లి సత్యం డిమాండ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌‌‌ను ధృతరాష్ట్రుడితో పోల్చిన కేటీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. స్పీకర్ దళితుడు కాబట్టే కేటీఆర్ ఆయన్ను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘కేటీఆర్‌‌‌‌కు అహంకారం నెత్తికెక్కి కండ్లు కనిపించడం లేదు. అత్యున్నతమైన స్పీకర్ వ్యవస్థను, ఆ స్థానంలో ఉన్న వ్యక్తిని ఇష్టానుసారంగా దూషించడం కేటీఆర్ అహంకారానికి నిలువెత్తు నిదర్శనం’’ అని ఆరోపించారు. స్పీకర్ చైర్‌‌‌‌‌‌‌‌లో దళితుడు ఉండడంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని పేర్కొన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర వారిదేనని విమర్శించారు.