
హీరో నాని అక్క దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయమవుతోన్న చిత్రం ‘మీట్ క్యూట్’. ఇదో ఆంథాలజీ మూవీ. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. సత్యరాజ్, రోహిణి లాంటి సీనియర్స్‌తో పాటు హీరోయిన్స్ అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, హీరోలు అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ముఖ్యపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు.
త్వరలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. నిన్న టీజర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ప్రేమ, కోపం, ఆశ, భయం, ఆశ్చర్యం, నమ్మకం, సంతోషం, హార్ట్ బ్రేక్ లాంటి ఎమోషన్స్‌తో ఆకట్టుకునేలా ఈ టీజర్‌ని కట్ చేశారు. ‘రిలేషన్ షిప్స్ ఫెయిల్ అయ్యేది చిన్న చిన్న గొడవలు వల్ల కాదు. ఆ ఫైట్ ఆపడం వల్లే’ అంటూ సత్యరాజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులోని కథలన్నీ అందరూ రిలేట్ చేసుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.