పవన్ కు చిరు బర్త్ డే విషెస్

పవన్ కు చిరు బర్త్ డే విషెస్

ఇవాళ జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 51వ సంవ‌త్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పవన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులు ఆయన పోస్టర్‌లకు పాలాభిషేకాలు చేస్తూ విషెస్‌ను తెలుపుతున్నారు. పవన్ తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. 

ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.. "పవన్ ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.. నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయతీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కల్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కల్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలియచేస్తున్నాను" అంటూ చిరు ట్విట్టర్ వేదికగా తెలిపారు.

 

మరోవైపు సాయి ధ‌ర‌మ్ తేజ్ తన మామకు బర్త్ డే విషెస్ తెలిపాడు. ‘నా గురువు, నా బ‌లం ప‌వ‌న్ కళ్యాణ్ మామకు జ‌న్మదిన శుభాకాంక్షలు. ప్రేమ‌, ఆరోగ్యం మ‌రియు ఆనందంతో ప్రతిరంగంలో రాణించాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.

‘‘భారతీయ చలనచిత్ర రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరైన పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ బీవీఎస్‌ రవి తెలిపాడు. బండ్ల గ‌ణేష్ ట్వీట్ చేస్తూ... ‘ఈ విశ్వంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే ప‌వ‌న్ ఈశ్వరుడు ఒక్కడే. మా దేవ‌ర‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని చెప్పాడు. 

‘‘మంచితనానికి మారుపేరు, మంచి మనసుకి నిర్వచనం, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం కలబోస్తే పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌.. పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఈయ‌న‌తో పాటు నితిన్‌, నాగ‌వంశీ, శ్రీనువైట్ల ఇలా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు.