ఆగస్ట్ 21న మెగాస్టార్ 'గాడ్ఫాదర్' టీజర్

ఆగస్ట్ 21న మెగాస్టార్ 'గాడ్ఫాదర్' టీజర్

అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి  రెడీ అవుతున్నారు.  ఈ నెల 22న చిరు బర్త్‌డే సందర్భంగా  'గాడ్ఫాదర్' నుంచి  టీజర్ రిలీజ్  అవుతోంది.  ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ ఓ పోస్టర్‌ ను కూడా షేర్‌ చేసింది. మలయాళంలో సూపర్‌హిటైన ‘లూసిఫర్‌’ మూవీకి  రీమేక్‌గా రూపొందుతున్న  ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

కొణిదెల ప్రొడెక్షన్‌ తో కలిసి ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, నయనతార చిరుకు సిస్టర్ గా నటిస్తోంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్, సునీల్‌ తదితరులు అతిథి పాత్రల్లో మెప్పించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గాడ్ఫాదర్ చిత్రాన్ని  ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ నెల 22  న చిరు 67 వ బర్త్‌డే జరుపుకుంటున్నారు.