
మెగాస్టార్ ‘చిరంజీవి’ నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ డైరెక్షన్ లో వస్తున్న మెగా 154 సినిమా టైటిల్ ‘వాల్తేర్ వీరయ్య’గా మేకర్స్ రిలీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత ‘చిరంజీవి’ ఊర మాస్ గెటప్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఇందులో మాస్ మహారాజ ‘రవితేజ’ కూడా నటిస్తున్నారు. వీరిద్దరినీ తెరపై చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిరు, రవితేజలు కలిసి డ్యాన్స్ చేయనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. భారీ సెట్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ అభిమానులను అలరిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. వారిద్దరూ కలిసి..ఎలా డ్యాన్స్ చేశారోననే ఉత్కంఠలో అభిమానులున్నారు. టైటిల్ టీజర్ లో చిరంజీవి మరోసారి పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. పూల చొక్కా, లుంగీ, చెవికి రింగ్, దమ్ము కొడుతూ మాస్ గా కనిపించాడు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రీలీజ్ కానుంది.