చెన్నై సూపర్ కింగ్స్ లో 12 మందికి కరోనా పాజిటివ్‌

చెన్నై సూపర్ కింగ్స్ లో 12 మందికి కరోనా పాజిటివ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)  లేటెస్టు సీజన్‌లో భాగంగా UAEలో అందరికంటే ముందు ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలని భావించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ను ఇప్పుడు కరోనా కలవర పెడుతుంది. CSK లో ఫాస్ట్ పేసర్ దీపక్ చాహార్ తో పాటు పలువురు స్టాఫ్‌ మెంబర్స్ కు కరోనా వైరస్ సోకింది. మొత్తంగా 12 మంది CSK సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ క్వారంటైన్‌ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి CSK ఇవాళ్టి (శుక్రవారం,ఆగస్టు-28) నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా అది కాస్తా ఇప్పుడు సాధ్యం కావడం లేదు. ఆగష్టు 21వ తేదీన దుబాయ్ చేరుకున్న CSK జట్టు.. షెడ్యూల్ ప్రకారం ఆరు రోజుల క్వారంటైన్ కూడా పూర్తి చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ సభ్యులు, సపోర్ట్ స్టాఫ్‌, అధికారులు శుక్రవారం మరోసారి టెస్టులు  చేయించుకున్న తర్వాత 12 మందికి పైగా కరోనా నిర్దారణ అయినట్లు నిర్ధారణ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే నెల 19వ తేదీ నుంచి ఐపీఎల్ మొదలుకానుంది.