- సిటిజన్ షిప్లో మార్పు చేసుకోండి: యూఎస్ సీఐఎస్
- హెచ్1బీ ఇమ్మిగ్రెంట్స్ కోసం కొత్త గైడ్‌లైన్స్
- జాబ్ పోతే 60 రోజుల్లో దేశం విడిచి పోవాలని రూల్
- ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన యూఎస్ సీఐఎస్
వాషింగ్టన్: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. జాబ్ కోల్పోయిన హెచ్1బీ వీసా హోల్డర్ 60 రోజుల్లోపు దేశం విడిచి వెళ్లిపోవాలి. ఈ రూల్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతూ ఫ్రెష్ గైడ్‌లైన్స్‌ను యూఎస్ సీఐఎస్ విడుదల చేసింది. 60 రోజుల గ్రేస్ పీరియడ్ దాటాక కూడా అమెరికాలోనే ఉండొచ్చని తెలిపింది. కానీ.. దీని కోసం సిటిజన్ షిప్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. జాబ్ పోయిందని 60 రోజుల తర్వాత అమెరికా విడిచి వెళ్లిపోవడం తప్ప వేరే దారిలేదని భావించొద్దని చెప్పింది. అమెరికాలో ఇండియన్స్‌తో పాటు పలు దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల గూగుల్, టెస్లా, వాల్‌మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు భారీగా లేఫ్ ఆఫ్స్ ప్రకటించాయి.
స్టేటస్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి
ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసా హోల్డర్ వెంటనే ఆల్టర్నేట్ జాబ్ వెతుక్కోవాలని యూఎస్ సీఐఎస్ తెలిపింది. దీంతో పాటు తమ ముందున్న ఆప్షన్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచించింది. గ్రేస్ పీరియడ్ కంటే ముందు నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. స్టేటస్ అడ్జస్ట్మెంట్ కోసం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కోసం అప్లై చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ వీసా ఉన్నవారు.. ఏడాది పాటు ఈఏడీకి అర్హత పొందొచ్చు. లేదంటే.. స్టేటస్ మార్పు కోరుతూ నాన్ ఫ్రివోలస్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేయొచ్చు. దీంతో సదరు అప్లికెంట్.. డిపెండెంట్ స్టేటస్ లేదా స్టూడెంట్ స్టేటస్ లేదంటే విజిటర్ స్టేటస్‌కు మారుతాడు. సెల్ఫ్ పిటిషన్డ్ ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్లకు అర్హులైన వాళ్లు స్టేటస్ అప్లికేషన్ అడ్జస్ట్మెంట్ కు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు అమెరికాలోనే ఉండేందుకు, ఈఏడీని పొందేందుకు వీలవుతుంది. గ్రేస్ పీరియడ్లోపు ఇందులో ఏదైనా ఒక దానికి అప్లికేషన్ పెట్టుకుంటే.. అమెరికాలోనే ఉంటూ వేరే జాబ్ చేయొచ్చని యూఎస్సీఐఎస్ తెలిపింది.