
సింగపూర్: సింగపూర్ ప్రధాన మంత్రిగా ప్రముఖ ఎకనామిస్ట్ లారెన్స్ వాంగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రెండు దశాబ్దాల పాటు పదవిలో ఉన్న లీ హ్సీన్ లూంగ్ స్థానంలో 51 ఏండ్ల వాంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) కి చెందిన నేతలు కాగా, సింగపూర్ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వాంగ్ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా కూడా పనిచేశారు. ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం వాంగ్‌తో ప్రధానిగా ప్రమాణం చేయించారు.