సీఎం సలహాదారుని కలిసిన సెక్యూరిటీ, ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ సభ్యులు

సీఎం సలహాదారుని కలిసిన సెక్యూరిటీ, ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ సభ్యులు

హైదరాబాద్, వెలుగు: సీఎం సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్ రావుని తెలంగాణ సెక్యూరిటీ, ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ సెక్యూరిటీ, ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ యజమానులకు గవర్నమెంట్ ఔట్ సోర్సింగ్ టెండర్లలో, కలెక్టరేట్ ఎంపానల్ మెంట్ లలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆయనకు వివరించారు.  మేనిఫెస్టో, చేవేళ్ల ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్లలో చెప్పినట్లు ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల టెండర్లకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. తద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ ఔత్సాహికుల అభివృద్ధి జరగడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో  కాంగ్రెస్​ నాయకురాలు ఇందిరా శోభన్,  అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ జాదవ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.