మధ్యాహ్న భోజనం : పిల్లలు ఇష్టపడి తినేలా మెనూ రెడీ చేశారు

మధ్యాహ్న భోజనం : పిల్లలు ఇష్టపడి తినేలా మెనూ రెడీ చేశారు

ఆంధ్రప్రదేశ్  చిత్తూరులో ఏర్పాటు చేసిన అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొని… ఆ పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం చేసే పిల్లలెవరూ రోజూ ఇదే తినాలా… అని అనుకోకుండా ఉండేలా పిల్లల కోసం మెనూ కార్డును తయారు చేశామన్నారు. వారంలోని ఆరు రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఏమి ఉండాలో అధికారులకు సూచించారు. పిల్లలకు ఏం పెడితే బాగుంటారని ఆలోచన చేసిన చరిత్ర ఏ సీఎంకు ఉండదన్నారు.  పిల్లల కోసం ఇంత ఆలోచన చేశామని చెప్పారు. రూ. 200 కోట్ల ఖర్చు ఎక్కువైనా భరిస్తామని తెలిపారు సీఎం జగన్.

మధ్యాహ్న భోజన పథకం మెనూ:

సోమవారం: అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీట్.

మంగళవారం: పులిహోర, టమాట పప్పు, బాయిల్డ్ ఎగ్.

బుధవారం: వెజిటబుల్ రైస్, ఆలు కుర్మా, బాయిల్డ్ ఎగ్, స్వీట్.

గురువారం: కిచిడీ, టమాట చట్నీ, బాయిల్డ్ ఎగ్.

శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, బాయిల్డ్ ఎగ్, స్వీట్.

శనివారం: అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్.