మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లోన్ల కోసం 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.96 కోట్లతో మెప్మా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉండగా వీటి పరిధిలో 1,924 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్‌హెచ్‌జీ)లు ఉన్నాయి.
2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఈ మున్సిపాలిటీల్లో బ్యాంక్ లింకేజీ కింద 530 ఎస్‌హెచ్‌జీలకు రూ.66.17 కోట్ల రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా రూ.70.37 కోట్లు (106 శాతం) లోన్లు అందించారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం కింద 33 ఎస్‌హెచ్‌జీలకు రూ.31.50 కోట్ల (98.44 శాతం) ఆర్థిక సహాయం అందించారు. 487 సంఘాలకు స్త్రీనిధి ద్వారా రూ.17.38 కోట్లు(91.47) శాతం లోన్లు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజీ కింద నాలుగు మున్సిపాలిటీల్లో 533 ఎస్‌హెచ్‌జీలకు రూ.75 కోట్లు, 217 ఎస్‌హెచ్‌జీలకు స్త్రీనిధి ద్వారా రూ.20 కోట్లు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం ద్వారా 100 మందికి రూ.లక్ష చొప్పున రూ.కోటి ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు జిల్లా మెప్మా పీడీ హన్మంతరెడ్డి తెలిపారు.
