ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై మూడ్రోజుల శిక్షణ

ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై మూడ్రోజుల శిక్షణ
  • ఏడు జిల్లాల నుంచి 56 మంది సీఆర్పీలను పంపించాలని మెప్మా ఎండీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24 వరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు రోజుల పాటు ‘ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్’ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మెప్మా ఎండీ దివ్య దేవరాజన్ తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొనేందుకు ఏడు జిల్లాల నుంచి మొత్తం 56 మంది సీఆర్పీలు లేదా ఆర్పీలను ఎంపిక చేసి పంపించాలని ఆయా జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వేదికగా జరిగే ఈ శిక్షణలో వ్యాపార నైపుణ్యాలు, సరైన ప్రాజెక్ట్ ఎంపిక, ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ, లీగల్ ఎంటిటీలపై అవగాహన, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ద్వారా ఉత్పత్తుల ప్రమోషన్ వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించనున్నామని చెప్పారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వికారాబాద్ జిల్లాల నుంచి ఒక్కో జిల్లాకు 8 మంది చొప్పున నామినేట్ చేసి పంపవలసిందిగా ఆమె స్పష్టం చేశారు.