
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడైన బుధుడు జులై 18న తన దిశను మార్చుకుంటాడని పండితులు చెబుతున్నారు. సవ్య దిశగా ఉన్న బుధుడు తిరోగమనంలో సంచరించడం ప్రారంభిస్తాడు. జూలై 18 వ తేది ఉదయం 10.13 గంటలనుంచి 25రోజుల పాటు అంటే ఆగస్టు 11 వ తేది వరకు బుధుడు తిరోగమనంలో సంచరిస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో మూడు రాశుల ( వృషభం, వృశ్చికం, కుంభం) వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. 12 రాశులవారి జీవితాలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!
మేషరాశి: బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కొన్ని పనులు మిమ్మలను ఆందోళనకు గురిచేస్తాయి. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండండి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి బుధుడు తిరోగమనంలో ఉన్నసమయంలో పనిభారం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి . జులై నెల చివరి నుంచి కొంత సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృషభరాశి: బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా కలసి వస్తుంది. ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపడితే ఊహించని లాభాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు జరుగుతాయి. చిన్న చిన్న విషయాల్లో వాగ్వాదాలు రావచ్చు.. కాబట్టి సంయమనం పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి . ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా మంచే జరుగుతుంది
మిథునరాశి: బుధుడు మీనరాశిలో తిరోగమనం చెందడం వలన ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతి ఫలం లభిస్తుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఆవేశాన్ని.. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎట్టి పరిస్థితిలో భావోద్వేగానికి లోను కావద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆఫీసులో మీరే కీలకం అవుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది.
కర్కాటక రాశి: బుధుడు తిరోగమనంలో ఉండటం వలన ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. కేరీర్ విషయంలో కొంత ఆందోళనకర వాతావరణం ఉంటుంది. మెరుగైన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. డబ్బును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి.. ఆదాయం మాత్రం పెరగదు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ..పెళ్లి విషయాలను వాయిదా వేయండి.. మంగళవారం 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి: బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన సింహరాశి జాతకులకు మెరుగైన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ఈ సమయంలో చేపట్టిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారని పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: బుధుడు తిరోగమన కదలిక వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. ప్రతి విషయంలోను.. మీకు సంబంధం లేకుండా మాట పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఏర్పడే అవకాశం ఉంది.. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత తగ్గుదల కనిపిస్తుంది. ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించి... ఆకుపూజ చేయండి అంతా మంచే జరుగుతుంది.
తులారాశి : బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈ రాశివారికి గడ్డుకాలమని పండితులు అంటున్నారు. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తారు. పనిభారం పెరుగుతుంది. ఆశించినంతగా ఆర్థికంగా పురోగతి ఉండదు. వ్యాపారస్తులు పోటీ మార్కెట్ లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది.
ఏ పని చేపట్టినా కలిసి రాకపోవడంతో .. మీ పని ప్రభావితమవుతుంది. మాసశివరాత్రి రోజు పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయండి అంతా మంచే జరుగుతుంది.
వృశ్చిక రాశి: బుధుడు తిరోగమనంలో సంచారం వలన ఈ రాశికి చాలా మంచి జరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో మీరే కీలకం కావడంతో ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. తొందరపడి ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
ధనుస్సు రాశి: బుధుడు తిరోగమనంలో కదలడం వలన ఈ రాశి వారికి సానుకూల ఫలితాలుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు ... వ్యాపారస్తులకు మంచి సమయం. కేరీర్ పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. బిజినెస్ చేసే వారు పెట్టే కొత్త పెట్టుబడులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. నిరుద్యోగులకు విదేశాల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రేమ వ్యవహారంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
మకరరాశి: బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన కొన్ని అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ... వ్యాపారాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి లేకపోవడంతో చికాకు... అసహనం కలుగుతాయి. ఉద్యోగ విధుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. . వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు .. సహనం పాటించండి .. తరువాత కాలంలో మంచే జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కొత్త ప్రాజెక్ట్లు చేపట్టవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆస్తి వ్యవహారాల్లో కీలకనిర్ణయాలు తీసుకోవద్దు. ఆదిత్యహృదయం పారాయణం చేయండి అంతా మంచే జరుగుతుంది.
కుంభరాశి : జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారి జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి.ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి కలసిరావడంతో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఏదో తెలియని ఆందోళన కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది.
మీనరాశి: బుధుడు ఇదే రాశిలో తిరగోమనంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కొన్ని తెలియని అంశాలు మిమ్మలను ఆందోళనకు గురిచేస్తాయి. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చేతివృత్తులవారికి ప్రోత్సహకాలు అందుతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది.