టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు.. మెటాలో 8 వేల జాబ్స్ కట్.. సిస్కోలో 4 వేల మంది ఔట్

టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు.. మెటాలో 8 వేల జాబ్స్ కట్.. సిస్కోలో 4 వేల మంది ఔట్

ఫేస్​బుక్​ పేరెంట్​ కంపెనీ మెటా ఈ నెల 20 నుంచి సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం. మరో టెక్ ​కంపెనీ సిస్కో నాలుగు వేల మందిని తొలగించాలని నిర్ణయించింది. ఏఐతో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను మారుస్తున్నామని తెలిపింది.

న్యూఢిల్లీ: అమెరికన్​ టెక్​ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్​బుక్​ పేరెంట్​కంపెనీ మెటా ఈ నెల 20 నుంచి సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం. ఎడాపెడా పింక్ ​స్లిప్స్​ ఇస్తుండటంతో తమ నైతిక ధైర్యం మునుపెన్నడూ లేనంతగా తగ్గిందని, కేవలం ఉన్నతాధికారులు తప్ప మిగిలిన వారంతా అసంతృప్తితో ఉన్నారని ఉద్యోగులు చెబుతున్నారు.  మరో టెక్​ కంపెనీ సిస్కో నాలుగు వేల మందిని తొలగించాలని నిర్ణయించింది.

ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను మార్చడమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం మందికి పింక్​ స్లిప్స్​ రానున్నాయి.  మైక్రోసాఫ్ట్​కు చెందిన లింక్​డ్​ ఇన్​ 875 మందిని, వాల్​మార్ట్​ వెయ్యి మందిని తొలగించనున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి కంపెనీలు ఇలాంటి  నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.