
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్‌ను ఎల్లో అలర్ట్‌కు తగ్గించింది. మంగళవారం కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.