మౌనిక కుటుంబానికి L&T పరిహారం రూ.20లక్షలు, ఉద్యోగం

మౌనిక కుటుంబానికి L&T పరిహారం రూ.20లక్షలు, ఉద్యోగం

మెట్రో పిల్లర్ పెచ్చులు మీదపడి చనిపోయిన మౌనిక కుటుంబ సభ్యులు ఎల్ అండ్ టీ అధికారులతో చర్చలు జరిపారు. నష్టపరిహారంగా 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబసభ్యులు. ఐతే ఎల్ అండ్ టీ అధికారులు 20 లక్షల నష్ట పరిహారం సహా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించారు.

నిన్న రాత్రి అమీర్ పేటలో భారీ వర్షం సమయంలో.. మెట్రో స్టేషన్ దగ్గర నిల్చున్న మౌనికపై.. పైనగోడ పెచ్చులు ఊడిపడ్డాయి. తలకు తీవ్ర గాయం అయింది. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు పోలీసులు. ఐతే.. చికిత్స తీసుకుంటూ చనిపోయింది మౌనిక. అధికారుల నిర్లక్ష్యంతోనే మౌనిక చనిపోయిందంటూ స్థానికులు సీరియస్ అయ్యారు. ఇవాళ ఉదయం TJS చీఫ్ కోదండరాం గాంధీ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులను పరామర్శించారు.