మోదీపై దాఖలైన పిటిషన్ డిస్మిస్

మోదీపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
  •  విచారణ అర్హత లేదంటూ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. దేవుళ్ల పేరుతో మోదీ ఓట్లు అడిగారని ఆరోపిస్తూ.. న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏప్రిల్ 9న యూపీలోని పిలిభిత్‌లో  ప్రధాని మోదీ.. హిందూ, సిక్కుల దేవతలతో పాటు వారి ప్రార్థనా స్థలాల పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. విపక్షాలు ముస్లింలకు అనుకూలంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారని కోర్టుకు నివేదించారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమేనని.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మోదీపై చర్యలు తీసుకోవాలని జోంధాలే కోర్టును కోరారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ కు విచారణ అర్హత లేదని తెలిపింది. దీన్ని తప్పుడు పిటిషన్ గా భావించి కొట్టివేస్తున్నన్నట్లు జస్టీస్ సచిన్ దత్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.