
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జూడో అసోసియేషన్ నూతన చైర్మన్‌గా మెట్టు సాయి కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో అసోసియేషన్ ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.కైలాష్ యాదవ్, జనరల్ సెక్రటరీ ఎం.ఎ.అజీజ్ ఫారూఖీ ఇతర ఆఫీస్ బేరర్లు, అన్ని జిల్లాల సెక్రటరీలు పాల్గొన్నారు.
తనకుఈ గౌరవాన్ని అప్పగించిన అసోసియేషన్ కార్యవర్గానికి సాయి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో రాష్ట్రంలో లో జూడో ఆటను అభివృద్ధి చేసేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.