కేటీఆర్‌‌‌‌ కు ఫినాయిల్ బాటిల్ పంపిన : ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి

కేటీఆర్‌‌‌‌ కు ఫినాయిల్ బాటిల్ పంపిన : ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి
  • ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తన నోరు శుద్ధి చేసుకోవాలంటూ ఆయనకు ఫినాయిల్ బాటిల్‌‌ను పంపించారు. ఈ మేరకు గురువారం గాంధీ భవన్‌‌లో జరిగిన మీడియా సమావేశంలో మెట్టు సాయి మాట్లాడుతూ.. కేటీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. 

‘‘చిల్లరగాళ్లు, భజనపరులను వెంటేసుకుని తిరుగుతూ రేవంత్ సర్కార్‌‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం’’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటివరకు సహనంతో ఉందని, దాన్ని చేతగానితనంగా భావిస్తే కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. భాష మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.