మిచౌంగ్ ఎఫెక్ట్​ .. సిటీ కూల్..

మిచౌంగ్ ఎఫెక్ట్​ .. సిటీ కూల్..
  •     నేడు, రేపు కూడా ఇలాగే.. 

హైదరాబాద్, వెలుగు : సిటీలో బుధవారం వెదర్ కూల్​గా మారింది. దీంతో సిటీ జనం చలికి వణికిపోయారు. మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్​తో ఆకాశం మేఘావృతమై ఉండగా టెంపరేచర్ పడిపోయింది. దీంతో వాతావరణం చల్లగా మారింది. ఉదయం పొగమంచు కమ్ముకుంది.  కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, గరిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నేడు, రేపు ఉదయం పొగమంచు కమ్ముకుంటుందని, ఆకాశం మేఘావృతమై ఉండి వాతావరణం చల్లగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, గురువారాల్లో కనిష్టంగా 20, గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, 6 నుంచి 10 కి.మీ వేగంతో చలి గాలులు వీచే చాన్స్ ఉందని పేర్కొంది.