హైదరాబాద్: మైక్రో సాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం..టెక్నిలక్ సమస్యలతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం ఏర్పడింది. చెక్ ఇన్ సిస్టమ్ లో సాంకేతిక లోపంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్ పోర్టుల్లో ఐటీ సర్వీసులు, చెక్ ఇన్ సిస్టమ్స్ పనిచేయకపోవడంతో చెక్ ఇన్, బోర్డింగ్ ప్రాసెస్ ఆలస్యంగా నడుస్తోంది.. దీంతో ఎయిర్ పోర్టు లో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.
ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ సంస్థల విమాన సర్వీసులపై ఎఫెక్ట్ పడింది. వీటితోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులపైనా ఎఫెక్ట్ పడింది. మరోవైపు దేశంలోని కొన్ని విమానాశ్రయాల్లో నిన్న రాత్రి నుంచే సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో పలు విమానాలు రాకపోకలు ఆలస్యంగా సాగాయి.
ALSO READ : పవన్ ఎప్పుడూ తెలంగాణకు వ్యరేకమే: కవిత
బుధవారం (డిసెంబర్ 3) మైక్రోసాఫ్ట్ విండోస్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగ దేశవ్యాప్తంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చెక్ ఇన్, బోర్డింగ్ కార్యక్రమాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సమస్యలతో వారణాసి , ఢిల్లీలో ఎయిర్ పోర్టులలో ఆపరేషనల్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎప్పుడూ రద్దీగా ఈ విమానాశ్రయాల్లో టెక్నికల్ సమస్యలతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు విమాన యాన సంస్థ తెలిపాయి.
