మెదక్: ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

మెదక్: ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

మెదక్ జిల్లా శివంపేట మండలం సీతారాం తాండాలోని ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో పాఠశాల వంట గదిలో మంటలు చెలరేగాయి. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటలు చెలరేగడంతో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ప్రమాదం జరిగింది. రాత్రిపూట పేలుడు జరగడంతో ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి కిచెన్ షెడ్డు పూర్తిగా ధ్వంసం అయింది మరియు పాఠశాలలో తరగతి గదులు కూడా ధ్వంసమయ్యాయి. ఆ పాఠశాలలో 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ ప్రమాదం రాత్రిపూట జరిగింది అదే ఉదయం పూట ప్రమాదం జరిగుంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు స్థానికులు.