ఎండిన కొమ్మలపై తెల్లటి పువ్వుల్లా కనిపిస్తున్న ఇవి నిజానికి కొంగలు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఓ ఖాళీ ప్రదేశంలో నీటిమడుగు మధ్య ఎండిన చెట్లపైకి చేరి ఇలా కనువిందు చేస్తున్నాయి. మరోవైపు ఇక్కడి మానేరు తీరంలో వేలాది రోజీ స్టార్లింగ్ పక్షులు సందడి చేస్తున్నాయి. మధ్య ఆసియా, ఐరోపాలో కనిపించే ఈ వలస పక్షులు సంధ్యా సమయంలో ఆకాశంలో రెక్కాలాడిస్తూ సూర్యుడికి వీడ్కోలు పలుకుతున్నట్లున్న ఈ అద్భుత దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
