Asia Cup 2025: అలా చేస్తేనే బాబర్‌కు టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుంది: పాకిస్థాన్ కోచ్

Asia Cup 2025: అలా చేస్తేనే బాబర్‌కు టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుంది: పాకిస్థాన్ కోచ్

ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ ప్రకటించిన 15 మంది స్క్వాడ్ లో స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ చోటు దక్కించుకోలేకపోయాడు. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. బాబర్ తో పాటు మరో సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‎ను పక్కన పెట్టి పాక్ క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈసారి ఆసియా కప్ టోర్నీ బాబర్, కోహ్లీ లాంటి స్టార్స్ లేకుండానే జరగబోతుంది. టీ20 క్రికెట్ లో అద్భుతమైన రికార్డ్ ఉన్నా.. ఇటీవలే చెత్త ఫామ్ బాబర్ ను ఆసియా కప్ నుంచి దూరం చేసింది. అనుభవం కారణంగా ఈ పాక్ స్టార్ బ్యాటర్ ను తీసుకుంటారని భావించినా పాక్ సెలక్టర్లు పూర్తిగా యంగ్ జట్టుకే ఓటేశారు.

బాబర్ అజామ్ ఆసియా కప్ కు ఎందుకు సెలక్ట్ కాలేదో ప్రధాన కోచ్, మైక్ హసన్ కారణం చెప్పుకొచ్చాడు. మైక్ హసన్ మాట్లాడుతూ.. "బాబర్‌ను కొన్ని అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్పిన్‌ ఆడడంలో ఆడడంలో అతని స్ట్రైక్ రేట్ మెరుగుపర్చుకోవాల్సి ఉంది. స్ట్రైక్-రేట్ బెటర్ అయితే అతను జట్టులో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాష్ లీగ్ లో బాబర్ ఆడనున్నాడు. ఈ మెగా లీగ్ లో కష్టపడి తిరిగి జట్టులో చోటు సాధిస్తాడని నమ్ముతున్నాం". అని పాక్ కోచ్ చెప్పుకొచ్చాడు. 

బాబర్ అజామ్ అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన మార్క్ తో అలరించలేకపోతున్నాడు. సమీప భవిష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం బాబర్ అజామ్ కే సాధ్యమని ఇప్పటికీ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్ పర్ట్స్ భావించినా ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం బాబర్ ఫామ్ లో లేడు. ముఖ్యంగా టీ20 క్రికెట్ లో వేగంగా ఆడలేక ఏడాది కాలంగా పాక్ జట్టులో చోటు కోల్పోయాడు. ఆసియా కప్ లాంటి టోర్నీకి సెలక్ట్ అవుతాడనుకున్న అది జరగలేదు. గత రెండేళ్లుగా ఈ పాక్ స్టార్ బ్యాటర్  బాబర్ ఫామ్ ఏమంత గొప్పగా లేదు. 

►ALSO READ | Duleep Trophy 2025: ఈస్ట్ జోన్‌కు దెబ్బ మీద దెబ్బ.. దులీప్ ట్రోఫీకి ఆకాష్ దీప్‌తో పాటు కెప్టెన్ ఔట్

ఫార్మాట్ ఏదైనా, టోర్నీ ఏదైనా రాణించలేకపోతున్నాడు. కెరీర్ ప్రారంభంలో టాప్ ఫామ్ తో దూసుకెళ్లిన ఈ పాక్ మాజీ కెప్టెన్ రెండేళ్లుగా చెత్త బ్యాటింగ్ తో జట్టుకు భారంగా మారాడు. 2026 ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ పొట్టి ప్రపంచ కప్ కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. బాబర్ అజామ్ బాగా ఆడితే టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవచ్చు. లేకపోతే టీ20 ఫార్మాట్ కు ఇక రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే.      

2025, సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికగా ఆసియా కప్ 2025 ఎడిషన్ జరగనుంది. ఈ సారి టీ20 ఫార్మాట్‎లో జరగనున్న ఆసియా కప్‎లోపాకిస్తాన్, ఇండియా, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్ ఏలో తలపడనున్నాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 12న ఒమన్‌తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్, భారత్ తలపడనున్నాయి.

ఆసియా కప్ 2025 పాకిస్తాన్ జట్టు:

సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ , ఫఖర్ జమాన్ , హరీస్ రవూఫ్, హసన్ అలీ , హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ వపెర్జ్, మొహమ్మద్ వాపెర్జ్ (వికెట్, మొహమ్మద్ వాపెర్జ్), సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా ఆఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్.