బీజేపీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోంది

బీజేపీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోంది

హైదరాబాద్: మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ముస్లింలను విమర్శిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. రాజాసింగ్ చర్యను ఖండించిన అసదుద్దీన్ ఓవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ముస్లింలను విమర్శించడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఎర్రకోటపై నిల్చుని పెద్ద ప్రసంగం ఇచ్చిన మోడీ... చిత్తశుద్ధి ఉంటే ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలని బీజేపీ నాయకులు చూస్తున్నారన్నారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిని బీజేపీ అడ్డుకోవాలని చూస్తోందన్న ఓవైసీ... ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంతగా దిగజారుతారా అని ప్రశ్నించారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే అరెస్టు చేసిన రాష్ట్ర సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు.