
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగుల కోసం ఈ నెల 10న మినీ జాబ్మేళా నిర్వహించనున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎన్. అనంతరెడ్డి తెలిపారు. అపోలో ఫార్మసీ, కాలిబ్ హెచ్ఆర్ బయోకేర్ మెడికల్ సిస్టమ్స్, హిందూజా గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, వేగారియస్ సొల్యూషన్స్, ఐడీబీఐ ఫెడరల్ ఎల్ఐసీ లిమిటెడ్, హెచ్ఆర్హెచ్ నెక్ట్స్, సన్ఫ్లవర్ సేల్స్ డిస్ట్రిబ్యూటర్స్, పేటీఎం, ఏజీఐ గ్లాస్ప్యాక్ప్రైవేట్ కంపెనీల్లో కస్టమర్ కేర్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ట్రైనీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.
19–35 ఏండ్ల మధ్య ఉండి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎంఫార్మసీ చదివిన వారు అర్హులన్నారు. హైదరాబాద్లోని కవాడిగూడ, లోయర్ట్యాంక్బండ్లోని ఏఆర్కే ట్రైనింగ్ సొల్యూషన్స్ (జాహ్నవి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ)లో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్లు తీసుకుని జనవరి 10 ఉదయం 10.30 గంటలకల్లా రావాలన్నారు. మరింత సమాచారం కోసం 8247656356/8886884049 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.