కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అవకాశాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అవకాశాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

 రాజన్నసిరిసిల్ల, వెలుగు: జనాభా దామాషా ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఏకసభ్య  కమిషన్ ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని ఎస్సీల నుంచి అభిప్రాయ సేకరణ మేరకు వర్గీకరణ చేశారన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏనాడూ దళితులను పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 42 శాతానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

 రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నివర్గాలకు సమాన అవకాశాలు దక్కుతున్నాయన్నారు. మాల సామాజిక వర్గం నుంచి డాక్టర్ వివేక్, మాదిగ సామాజిక వర్గం నుంచి తనకు మంత్రివర్గంలో చోటు దక్కిందన్నారు. సిరిసిల్లలో దళితులకు దక్కాల్సిన భూములను వారికే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం నెల రోజుల్లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కత్తెర దేవదాస్, బోయినిపల్లి సెస్ డైరెక్టర్ సుధాకర్, దళిత నాయకులు అంకని భాను పాల్గొన్నారు.