Lakhimpur Kheri Case: అట్టుడికిన పార్లమెంట్.. వాయిదా

Lakhimpur Kheri Case: అట్టుడికిన పార్లమెంట్.. వాయిదా

పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి.లఖింపూర్ ఖేరీ కేసు విచారణపై సిట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు పార్లమెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. సిట్ ఇచ్చిన రిపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ బీజేపీపై విమర్శల దాడి పెంచింది. వెంటనే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే విషయంపై ఇవాళ రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడారు. అజయ్ మిశ్ర ఓ క్రిమినల్ అంటూ ధ్వజమెత్తారు. అమాయక రైతు ప్రాణాల్ని బలితీసుకున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్ డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఓ వైపు ప్రతిపక్షాల విమర్శలు.. మరోవైపు అధికార పార్టీ వాగ్వాదాలతో లోక్ సభ అట్టుడికింది. రాహుల్ ప్రసంగాన్ని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.