పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు..అక్కడ..ఇక్కడ అంటూ ...

పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు..అక్కడ..ఇక్కడ అంటూ ...

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.  'విలువలు లేని తమకే ఇది సాధ్యం!' అని ట్వీట్ చేసి, పవన్‌తో చంద్రబాబు, కిషన్‌రెడ్డి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై మాత్రమే కాదు.. చంద్రబాబు, కిషన్‌రెడ్డిని కూడా టార్గెట్ చేశారేమో అని ఈ పోస్ట్ ను బట్టి అర్థమవుతుంది.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లబోతుంది. ఇక ఈ వ్యవహారంపై ఏపీ, తెలంగాణలో జనసేన సాగిస్తున్న రాజకీయంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ కు ఏదైనా సాధ్యమేనని, విలువలు లేని రాజకీయాలు చేయాలంటే పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు అంటూ ఆయన విరుచుకుపడ్డారు.

 జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతుంది. ఎన్నికల్లో జనసేన 9 స్థానాల్లో పొత్తుతో పోటీ చేయనుంది. ఈ ఎన్నికలలో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పొత్తుల్లో భాగంగా నిర్ణయించిన బిజెపి, జనసేన పార్టీలు ఈ మేరకు తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించనున్నాయి.

ALSO  READ : చంద్రబాబును పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
 

ఏది ఏమైనా నిత్యం సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న కొటేషన్స్ తోనే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే అంబటి మరోమారు పవన్ కళ్యాణ్ పై విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారంటూ టార్గెట్ చేశారు. అందులో పవన్ చంద్రబాబుతో ఏపీలో, తెలంగాణలో బీజేపీ కిషన్ రెడ్డితో ఉన్న ఫోటో షేర్ చేశారు.