V6 News

సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు

సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 20న జరిగే సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌భాబు ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మంత్రులు, ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లతో కలిసి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారని చెప్పారు.

అనంతరం కాటారం మండలం నస్తూర్‌‌‌‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరవుతారని, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావుతో కలిసి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సీఎం టూర్‌‌‌‌ విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌‌‌‌ సింగ్‌‌‌‌ రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌, కలెక్టర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అటవీశాఖ అధికారి నవీన్‌‌‌‌రెడ్డి, కాటారం సబ్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ మయాంక్‌‌‌‌సింగ్‌‌‌‌, అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు అశోక్‌‌‌‌కుమార్‌‌‌‌, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేశ్‌‌‌‌కుమార్‌‌‌‌, గ్రంథాలయ సంస్థ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ రాజబాబు, మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ బుర్ర కొంరయ్య పాల్గొన్నారు.