ప్రజలను చల్లంగా చూడాలని మొక్కుకున్నా : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రజలను చల్లంగా చూడాలని మొక్కుకున్నా :  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  •     మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ముత్తారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన జమదగ్ని ముని సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిష్టాపనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. మంథని మండలం సూరయ్య పల్లి గ్రామంలో భూలక్ష్మీ మహాలక్ష్మి, బొడ్రాయి విగ్రహాల శ్రవణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో లీడర్లు చొప్పరి సదానందం, దొడ్డ బాలాజి, అల్లం కుమారస్వామి, కొట్టె అన్నపూర్ణ, మద్దెల రాజయ్య, జగన్ మోహన్ రావు, శివ, కిరణ్, కుమారస్వామి పాల్గొన్నారు.