మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే మహిళా శక్తి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే మహిళా శక్తి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు

కాటారం, వెలుగు : మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు, వారి అభివృద్ధే లక్ష్యంగా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు చెప్పారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ మండల కేంద్రంలోని కుమ్రంభీం సెంటర్‌‌‌‌, కాటారం మండలం కొత్తపల్లి వద్ద జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు, కలెక్టర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ శర్మ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వంటకాల రుచి చూశారు. అనంతరం మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మహిళా శక్తి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

ఈ క్యాంటీన్ల ఏర్పాటు వల్ల మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించవచ్చన్నారు. కలెక్టర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ శర్మ మాట్లాడుతూ మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు మహిళా శక్తి కార్యక్రమంలో ఎంతో తోడ్పడుతుందన్నారు. మహిళా శక్తి కార్యక్రమం వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు, కలెక్టర్‌‌‌‌ రాహుల్‌‌‌‌శర్మ, ఎస్పీ కిరణ్‌‌‌‌ ఖరే ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ అయిత ప్రకాశ్‌‌‌‌రెడ్డి, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ విజయలక్ష్మి, కాటారం సబ్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ మాయాంక సింగ్‌‌‌‌, డీఆర్డీవో అవినాశ్‌‌‌‌, డీపీవో నారాయణరావు పాల్గొన్నారు.