
వరంగల్: వరంగల్ ను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్ది, దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. వరంగల్ లో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డులు ఏర్పాటు చేసి నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. వేయి స్తంబాల దేవాలయానికి పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు. భద్రకాళి ట్యాంక్ బండ్ ను సుందరంగా చేస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ఎర్రబెల్లి ఈ సందర్భంగా అన్నారు. ప్రాజెక్టుకు ప్రతిపక్ష పార్టీలు సహకరిచాలన్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు ప్రాజెక్టుపై విమర్శలు చేయటం మానుకోవాలని సూచించారు. అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం వల్లే SRSP కాలువల ద్వారా నీరు రాలేదని, SRSP కాలువలకు ఆధునికీకరణ కు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించుతున్నందునా పల్లెల్లో రైతులు పండుగ చేసుకోవాలని మంత్రి దయాకర్ రావు అన్నారు.