మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ మాయం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ మాయం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ మాయమైంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. గుట్ట పైన మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలినడకన వెళ్లారు. 

ఈ క్రమంలో కళ్యాణ్ వేదిక వద్ద ఒక్కసారిగా భక్తులు తోసుకువచ్చారు. దీంతో మంత్రి జేబులోని మొబైల్ ఫోన్ కింద పడింది. అది గుర్తు తెలియని భక్తుల చేతిలో పడింది. మంత్రి ఫోన్ పోయిందని భక్తులకు ఎవరికైనా దొరికితే తెచ్చి ఇవ్వాలని దేవస్థానం అధికారులు మైక్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మంత్రి కొద్ది సమయం కల్యాణ వేడుకలల్లో పాల్గొని హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.